దిశ, శేరిలింగంపల్లి : రివల్యూషనరీ కేర్ ట్రాన్స్ ఫార్మేటివ్ రీసెర్చ్ పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ నేతృత్వంలో సాంకేతికతతో నడిచే సంస్థ పై భారతదేశంలో క్యాన్సర్ సంరక్షణలో కొత్త శకాన్ని ప్రారంభించింది. క్యాన్సర్ పై పోరాటంలో స్ఫూర్తిగా నిలిచిన పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ ను సోమవారం గచ్చిబౌలిలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి టి.హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రపంచ స్థాయి చికిత్సను అందించడానికి సిద్ధంగా ఉందని, క్యాన్సర్ నుండి ప్రజలను కాపాడడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అమెరికా, బ్రెజిల్, చైనా, ఆస్ట్రేలియా దేశాలలో అనేక శాఖలను కలిగి ఉందని, ప్రస్తుతం మన హైదరాబాద్, నిజామాబాద్ లలో తన శాఖలను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజనల్ ఆంకాలజీ డైరెక్టర్, గ్లోబల్ సీఈఓ డా. జియోఫ్ కిమ్, పై హెల్త్ గ్లోబల్ సీఓఓ డాక్టర్ బాబీరెడ్డి, పై హెల్త్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.